'ఏఏఏ' చిత్రం షూటింగ్ ప్రారంభo..
- July 13, 2016
శింబు నటిస్తున్న కొత్త చిత్రం 'ఏఏఏ'లో అందాలతార శ్రేయ తల్లిగా నటిస్తుందంటూ వస్తున్న వార్తలను చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఖండించారు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలియడం లేదని, తమ చిత్రంలో శ్రేయా హీరోకి తల్లిగా నటించడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆమె పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకమైనదని, ఆమె కెరీర్‌కి మంచి బ్రేక్ ఇచ్చేలా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో శింబు త్రిపాత్రల్లో నటిస్తుండగా, ఒక పాత్రతో ప్రేమలో పడే పాత్రలోనే శ్రేయా నటిస్తోందని చెప్పారు. శింబు - శ్రేయల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని కూడా చెప్పారు. కాగా, 'ఏఏఏ' చిత్రం షూటింగ్ రెండ్రోజుల క్రితం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. యువన శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తరువాత శింబు - యువన్ కాంబినేషనలో ఈ చిత్రం రూపొందుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







