దుబాయ్‌కు భారీ ఊరట: కీలక ఆంక్షలకు గుడ్‌బై!
- June 14, 2025
దుబాయ్: దుబాయ్‌కు తాజాగా యూరోపియన్ యూనియన్(EU) భారీ ఊరట కలిగింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతు ఇచ్చే అవకాశమున్న హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూఏఈను తొలగిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.ఇంతకాలం హై-రిస్క్ జాబితాలో ఉండటం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు, బ్యాంకింగ్ లావాదేవీలపై అరబ్ దేశాలకు కొన్ని పరిమితులు, అదనపు నియంత్రణలు ఉండేవి.
కానీ, ఇప్పుడు యూఏఈ పై ఆ ఆంక్షలు ఎత్తేశారు.గతంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యూఏఈను గ్రే లిస్ట్ లో చేర్చింది.దాని తర్వాత యూఏఈ ప్రభుత్వం మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌పై పోరాటానికి పలు సంస్కరణలు చేపట్టింది.ఈ సంస్కరణలు యూరోపియన్ యూనియన్ కు నచ్చేటట్లుగా ఉండటంతో, తాజాగా ఆ దేశాన్ని హై-రిస్క్ జాబితా నుంచి తొలగించారు.ఈ నిర్ణయంతో యూఏఈ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో విశ్వసనీయతను మరింతగా బలోపేతం చేసుకుంది.
హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూఏఈకు విముక్తి లభించడంతో ఇది విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించడానికి ఎంతగానో దోహదపడుతుంది.యూరప్ దేశాలతో సంబంధాలు మెరుగవుతాయి.అంతర్జాతీయ బ్యాంకులకు అరబ్ దేశాలపై నమ్మకం కూడా పెరుగుతుంది. అలాగే ఇండియాతో సహా అనేక దేశాలకు యూఏఈ ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉండడం వల్ల ఇయు తాజా నిర్ణయం ఆయా దేశాలకూ ప్రభావం చూపవచ్చని అంటున్నారు. కాగా, యూఏఈ తో పాటు బార్బడోస్, జిబ్రాల్టర్, జమైకా, పనామా, ఫిలిప్పీన్స్, సెనెగల్ మరియు ఉగాండాలను కూడా హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూరోపియన్ కమిషన్ తొలగించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







