ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!

- June 15, 2025 , by Maagulf
ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!

ముంబై: ఆర్సీబీ విజయం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో, అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.

ఈ ఘటనపై బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.అందుకే కమిటీ ఏర్పాటుచేశాం.త్వరలోనే కమిటీ తగిన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది” అని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com