ఖతార్ లో కార్లు, మోటార్ సైకిళ్ల వేలం..రిజిస్ట్రేషన్ ఇలా..!!

- June 15, 2025 , by Maagulf
ఖతార్ లో కార్లు, మోటార్ సైకిళ్ల వేలం..రిజిస్ట్రేషన్ ఇలా..!!

దోహా, ఖతార్: రిజిస్టర్ రద్దు చేసిన కార్లు, మోటార్ సైకిళ్ళు, యంత్రాలు, వర్క్‌షాప్ స్క్రాప్‌ల అమ్మకం కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేలం జూన్ 22 నుండి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య జరుగుతుంది. అన్ని వస్తువులు అమ్ముడయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు.

పారిశ్రామిక ప్రాంతంలోని వీధి నంబర్ 1లోని వర్క్‌షాప్‌లు, రవాణా శాఖకు ఆనుకుని ఉన్న వేలం యార్డ్ లో వేలం ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు జూన్ 17 నుండి 19 వరకు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య వాహనాలు, యంత్రాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు.

వేలంలో విక్రయించే వాహనాలను ట్రాఫిక్ శాఖ నుండి రిజిస్ట్రేషన్ రద్దు చేసిందని, ఎటువంటి చట్టపరమైన లేదా ఆర్థిక చలానాలు ఉండవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వేలంలో పాల్గొనేవారు QR3,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం ద్వారా వేలం కార్డును పొందాలని సూచించారు.  

వేలం నిబంధనలలో భాగంగా.. QAR 15,000 కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 30% డౌన్ పేమెంట్ అవసరం. కనీసం QAR 5,000 చెల్లింపు చేయాలి. QAR 15,000 లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు పూర్తి చెల్లింపు (100%) చేయాలి. కొనుగోలుదారులు బిడ్ గెలిచిన సమయంలో పూర్తిగా చెల్లించాలి.  కొనుగోలు చేసిన 24 గంటల్లోపు పూర్తి చెల్లింపు చేయకపోతే, వాహనాన్ని తిరిగి వేలం వేసే హక్కు కమిటీకి ఉంటుందని, కొనుగోలుదారు చెల్లించిన ఏదైనా డిపాజిట్‌ను కోల్పోతారని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com