SLV సినిమాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం
- June 17, 2025
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76 తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైయింది.ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.
ఈ చిత్రం ఈరోజు అఫీషియల్ గా సెట్స్ పైకి వెళ్ళింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది.రవితేజ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ధమాకా చిత్రానికి బ్లాక్‌బస్టర్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం రవితేజతో కలిసి పని చేస్తున్నారు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
#RT76 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: రవితేజ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డిఓపి: ప్రసాద్ మురెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







