'కుబేర' అద్భుతమైన తారాగణంతో గేమ్-ఛేంజర్‌గా సినిమా
- June 17, 2025
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున,రష్మిక మందన్న,హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'.అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది.ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి 'కుబేర' ట్రైలర్ ని లాంచ్ చేశారు.
గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా హంబుల్ గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది.కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు.ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను.శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు.నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలు కి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు.తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.నాగార్జున, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర..ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ గా అనిపించింది.ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది.ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది.ఒక రిచ్ ప్రపంచంలో నాగర్జున, పూర్ ప్రపంచంలో ధనుష్..సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్ ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్ లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది.నాగార్జున గారిని ధనుష్ ని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది.దీని కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను.ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది.మైండ్ బ్లోయింగ్ విజువల్స్.ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది.ప్రతిది టాప్ క్లాస్ లో వున్నాయి.దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీఫెంటాస్టిక్ గా ఉన్నాయి.జూన్ 20. డోంట్ మిస్ కుబేర'అన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ..అందరికి నమస్కారం.ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ థాంక్యూ.ధనుష్ టప్ కలసి వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను.తను ఒక క్యారెక్టర్ లో పెర్ఫార్మ్ చేసే విధానం అవుట్ స్టాండింగ్.తనకి మరిన్ని విజయాలు రావాలి.తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.కుబేర గురించి మాట్లాడాలంటే నాకు శేఖర్ కమ్ముల గారు గుర్తుకొస్తారు.ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం.మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే. ఆయన కంఫర్ట్ జానే నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. మాయాబజార్ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. లాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. శేఖర్ కమ్ముల కోసమే ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా హిట్ అవుతుందని శేఖర్ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. శేఖర్ పై పూర్తి నమ్మకం.ఉంది దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.పాటలు వింటుంటే పూనకం వస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాతలు సునీల్, రామ్ మోహన్ కి థాంక్ యూ.టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది. ఎలాంటి పాత్రలు చేసిన మీరు ఒప్పుకుంటున్నారు.చూస్తున్నారు.అభినందిస్తున్నారు.మీరు ఉన్నంతవరకు ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఐ లవ్ యూ టు ఆల్'అన్నారు.
హీరో ధనుష్ మాట్లాడుతూ..ఓం నమశ్శివాయ.అందరికీ నమస్కారం.ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారి గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు.ఈరోజు ఇక్కడ ఇక్కడ వుండటానికి కారణం ఆయన కష్టం. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు.శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హెల్త్ ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఆయన విషయంలో నేను చాలా కంగారు పడ్డాను. ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా.శేఖర్ సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు.నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం.కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్కి ధన్యవాదాలు.నాగార్జున తో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్.ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ఆయన సినిమాలు చూస్తూ పెర్గిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్.రష్మిక హార్డ్ వర్క్ చేసింది.తన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సునీల్, రామ్మోహన్ కి థాంక్ యూ.వారు లేకపోతే ఈ సినిమా లేదు.నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.కుబేర చాలా స్పెషల్ ఫిలిం. జూన్ 20 వస్తుంది.తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది'అన్నారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నా 25 ఇయర్స్..మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి. మీడియాకి ధన్యవాదాలు.ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను.కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా కోటీశ్వరుడైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్న.సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకుని చూస్తుంది.ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా.అంత ఫ్రెష్ గా ఉంటుంది.ఏ రాష్ట్రంలో ఆడియన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది.ట్రూ పాన్ ఇండియన్ మూవీ. ఇందులో నవ్వు ఎమోషన్ ఏడుపు థ్రిల్ ఆశ్చర్యం బాధ అన్ని కలగలిపి ఉంటాయి.కుబేర ఫెంటాస్టిక్ ఫిలిం.మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగార్జునతో షూట్ చేస్తున్నప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను.శివ షూటింగ్ టైం లో నాగార్జునని చూశాను.ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.నేను ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రెడీ అన్నారు.అందుకు నాగార్జునకి ధన్యవాదాలు.నాకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ సినిమాని చేశారు.రశ్మిక తను చాలా బ్యూటిఫుల్ పర్సన్. లోపల బయట ఒకేలా ఉండే అమ్మాయి. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. జిమ్ షర్బ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫాం చేశాడు.ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే.తను ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలంటే నిజంగా అలానే కనిపించి చూపించాడు.కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తనని బడమని చెప్పారని,నిజంగానే సన్నబడి చూపించాడు.తనకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చిన తక్కువే. తోట తరిణి నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. దేవిశ్రీ సినిమాకి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు.అది మ్యూజిక్ లో కనిపిస్తుంది.సునీల్, రామ్మోహన్ ఇంత బిగ్ స్కేల్ సినిమాని ఎక్కడ జంకకుండా నిర్మించారు.ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కుబేర డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను.ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్యూ.కుబేర ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది'అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ..అందరికి నమస్కారం.కుబేర నాకు గొప్ప ఆపర్చునిటీ. నాకు శేఖర్ గారితో వర్క్ చేయాలని వుండే. ఆ అవకాశం ఈ సినిమాతో దొరికింది.ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది.మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. టీమందరికీ థాంక్యూ.నాగార్జునతో రెండోసారి కలిసి పని చేసే అవకాశం దొరికింది. ఆయన వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ధనుష్ గారితో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మా కెమిస్ట్రీ చూసి మరి కొంత మంది దర్శకులు రచయితలు కొత్త సినిమాలు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నాను.ఆయనతో మరోసారి కలిసి పని చేయాలని ఎదురుచూ స్తున్నాను.నిర్మాతలు చాలా బడ్జెట్ పెట్టి అద్భుతంగా ఈ సినిమాని తీశారు.ఈ సిమమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'అన్నారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.సినిమా జర్నీలో నన్ను ఎంతోగా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. కుబేర చాలా స్పెషల్ ఫిలిం.దీని గురించి ఎంత మాట్లాడిన తక్కువే అనిపిస్తుంది.శేఖర్ తో ఎప్పటినుంచో వర్క్ చేయాలి.ఫైనల్ గా కుబేరతో అది కుదరడం చాలా ఆనందంగా ఉంది.అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు.ఇలాంటి కథని ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి వుండము. చాలా అద్భుతంగా తీశారు.ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు.నేషనల్ క్రష్ రష్మిక చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు.సినిమా అంతా ఉంటారు.చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు.ధనుష్ అద్భుతంగా చేశారు. ఇది వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్.ఆయన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ గానే కనిపించారు.నాగార్జునతో నాది విడదీయలేని బంధం. ఇందులో ఆ క్యారెక్టర్ నాగర్జున చేయకంటే ఇంక ఎవరితో చేసేవారో ఊహకు అందటం లేదు.అంత రాయల్ గా కనిపించారు.ఈ సినిమా స్టార్ కాస్ట్ అమేజింగ్.ఈ సినిమాల్లో పార్ట్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను.జూన్ 20న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి.నిర్మాతలు సునీల్ జాన్వి సపోర్ట్ కి థాంక్యూ. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను'అన్నారు.
నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.శేఖర్ కమ్ముల ఒక డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసే అద్భుతమైన ఫిలిం మేకర్.ఈ సినిమాని అంతే డిఫరెంట్ గా వేరే జానర్ లో తీశారు. థ్రిల్లర్ క్రైమ్ సస్పెన్షన్ అన్ని ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు.శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ధనుష్ గారు ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు.ఆయన ఆల్ రౌండర్. నాగార్జున గారు మాకు ఎంతో స్పెషల్. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మా సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.300 కోట్ల హీరోయిన్ రష్మిక మా సినిమాలో వున్నారు(నవ్వుతూ) దేవిశ్రీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్, ప్రొడక్షన్ టీం కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు
లిరిక్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. శేఖర్ గారి సినిమాకి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను.దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరూ చూడండి'అన్నారు.
లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల గారితో ఇది రెండో అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను. శేఖర్ గారు, దేవి శ్రీ ప్రసాద్ గారి స్టైల్ ని క్లబ్ చేయడానికి చాలా టైం పట్టింది. అయితే రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. నాగార్జున, ధనుష్, రష్మిక కి అందరికీ ధన్యవాదాలు.ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడుతూ..అందరికి నమస్కారం.శేఖర్ కమ్ములతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది.చాలా వండర్ఫుల్ టీంతో కలిసి చేసిన సినిమా ఇది.చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు