యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులకు హిజ్రీ నూతన సంవత్సర సెలవు..!!

- June 17, 2025 , by Maagulf
యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులకు హిజ్రీ నూతన సంవత్సర సెలవు..!!

యూఏఈః ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించారు. జూన్ 27 (శుక్రవారం) ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.  ఇది హిజ్రీ సంవత్సరం 1447 AH ప్రారంభాన్ని సూచిస్తుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ప్రకటన ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తిస్తుంది.అలాగే వారికి 3 రోజుల లాంగ్ వీకెండ్ వస్తుంది. సాధారణ పని గంటలు జూన్ 30, సోమవారం నుండి తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
ఇస్లామిక్ లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్ర నెలలపై ఆధారపడి ఉంటుంది. నూతన సంవత్సరం క్యాలెండర్ మొదటి నెల అయిన ముహర్రం మొదటి రోజున ప్రారంభమవుతుంది. యూఏఈ క్యాబినెట్ జారీ చేసిన 2025 అధికారిక సెలవుల జాబితాకు అనుగుణంగా ఈ తేదీని నిర్ధారించారు. ఈద్ అల్ అధా సెలవుల సమయంలో నివాసితులు ఆస్వాదించిన లాంగ్ వీకెండ్ తర్వాత హిజ్రీ నూతన సంవత్సర సెలవుదినం వస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com