అణు అత్యవసర పరిస్థితులపై కువైట్ సన్నద్ధత..!!
- June 17, 2025
కువైట్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న వార్ నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కువైట్ తన సంసిద్ధతను అంచనా వేయడానికి సమావేశమైంది. అణు రియాక్టర్ల నుండి తలెత్తే ప్రమాదాలు, నష్టాలను అంచనా వేయడానికి జాతీయ స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్మీ జనరల్ స్టాఫ్ ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు లేదా విపత్తులకు ప్రతిస్పందనకు కీలకమైన రంగాల సంసిద్ధతను సమీక్షించడానికి సైనిక, పౌర సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారని తెలిపారు. వీరిలో ఇంధనం, నీరు, ఆరోగ్య రంగాలలో ప్రతినిధులు..జాతీయ సామర్థ్యాలతో పాటు పర్యావరణ పర్యవేక్షణ వ్యూహాలు, పౌర రక్షణ ప్రణాళికలపై చర్చించారు. వాయు, సముద్ర సంక్షోభాలను అడ్డుకునేందుకు యంత్రాంగాల సన్నద్ధతను సమీక్షించారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!