Israel-Iran :గగనతలాన్ని మూసివేసిన పలు దేశాలు .. చిక్కుకుపోయిన ప్రయాణికులు
- June 17, 2025
ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై భారీ ఎత్తున క్షిపణి దాడులు కొనసాగించడంతో, పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేసి విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఇరాన్ తన సైనిక చర్యలను తీవ్రతరం చేయడంతో ఈ చర్యలు మరింత విస్తరించాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో.. తమ గగనతలాన్ని పలు దేశాలు మూసివేశాయి.
రాకపోకలు బంద్
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్, జోర్దాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఈ చర్యతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 10 వేల మందికిపైగా ప్రజలు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
చిక్కుల్లో ప్రయాణికులు
మరోవైపు ఇజ్రాయెల్ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో దాదాపు 50 వేల మందికిపైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని మూడు విమానయాన సంస్థలకు చెందిన జెట్ విమానాలను లార్నాకాకు తరలించారు. ఇజ్రాయెల్ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్‌లతో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లవద్దని, ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ అధికారి ఇజ్రాయెల్ చర్యలను “భయంకరమైన, అప్రతిష్టమైన బాధ” అని అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ, శాంతి కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!