ఇరాన్ కీలక బ్యాంకు పై సైబర్ దాడి

- June 17, 2025 , by Maagulf
ఇరాన్ కీలక బ్యాంకు పై సైబర్ దాడి

ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)ఆధీనంలోని ఒక ముఖ్యమైన బ్యాంకుపై సైబర్ దాడి జరిగింది.ఈ దాడి కారణంగా బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు ఇరాన్‌ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ సైబర్ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ‘గొంజెష్కే దరాందే’ అనే ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తల బృందం ప్రకటించింది. ఈ బృందం తమను తాము ‘వేటాడే పిచ్చుక’గా అభివర్ణించుకుంటుంది.

వివరాలు ఇలా..
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, ఈ సైబర్ దాడి కారణంగా బ్యాంకు సేవల్లో పలు ఆటంకాలు ఎదురయ్యాయి.అయితే, ఈ అంతరాయాల తీవ్రత, వాటి ప్రభావంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘గొంజెష్కే దరాందే’ బృందం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. గతంలో కూడా ఈ తరహా ప్రభుత్వ వ్యతిరేక బృందాలు ఇరాన్‌లోని కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.

ఇరాన్ అధికారిక స్పందన లేదు
ఈ సైబర్ దాడి పై ఇరాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ దాడి వెనుక ఉన్న పూర్తి ఉద్దేశ్యాలు, వాటి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయంగా ఇలాంటి సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరోసారి భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.

భవిష్యత్తు పరిణామాల పై భయం
ఇలాంటి సైబర్ దాడులు బ్యాంకింగ్ సెక్టార్‌తో పాటు, దేశ భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం. IRGC వంటి మిలిటరీ ఆధారిత వ్యవస్థలు టార్గెట్ కావడమే దాడిదారుల దూకుడు స్పష్టం చేస్తోంది. అంతర్గత అసంతృప్తి, ప్రవాస ఇరానియన్ల మద్దతు ఉన్న గూఢచర్య సంస్థలు ఇలా వ్యతిరేక శక్తుల సమన్వయం వంటి అనుమానాలు. అంతర్జాతీయంగా ఇరాన్‌పై వేధింపులకు అవకాశం కలిగించే పరిణామంగా మారింది. గోప్యంగా ఉండాల్సిన సమాచారం ఎలాంటి ముప్పుకు గురైందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ఘటన మరింత విశదీకరణకు పాల్పడాలని, ఇరాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు గమనించాల్సిన అంశం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com