ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!
- June 18, 2025
లండన్: ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ పై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కీలక ప్రకటన చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరించారు. తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. "రాజకీయ, దౌత్య పరిష్కారాలకు ప్రత్యామ్నాయం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి , భద్రతా మండలి జోక్యం చేసుకుని పెరుగుతున్న హింసను ఆపాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వాటి సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం ఉందని, ఇది మరింత తీవ్ర నష్టాని దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. "రెండు పార్టీలను ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందేలా, శత్రుత్వాలను అంతం చేయడానికి పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీయకుండా నిరోధించడానికి దౌత్యపరమైన విధానం అత్యవసరం అని యూఏఈ విశ్వసిస్తోంది." అని ఆయన అన్నారు. సంఘర్షణలను ఆపేందుకు అంతర్జాతీయ దౌత్యం అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!