ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 18, 2025
యూఏఈ: ఇతర ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ఇరాన్ ధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్రిక్తత నివారణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, ప్రాంతీయ సంఘర్షణను తగ్గించడంలో యూఏఈ నిబద్ధతను షేక్ మొహమ్మద్ తెలియజేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన సంప్రదింపులలో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని షేక్ మొహమ్మద్ హామీ ఇచ్చారు.తిరిగి ప్రశాంతతను పునరుద్ధరించడానికి.. సంభాషణను ప్రోత్సహించడానికి దోహదపడే ఏవైనా చర్యలకు యూఏఈ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణపై పెరుగుతున్న ఆందోళనల మధ్య దౌత్యం, సంఘర్షణల శాంతియుత పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో యూఏఈ విస్తృత ప్రాంతీయ విధానాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!