ఇరాన్ వాసులకు యూఏఈ సాంత్వన.. ఓవర్‌స్టే జరిమానాలు రద్దు..!!
- June 18, 2025
దోహా, ఖతార్: ఇరానియన్ పౌరులు, నివాసితులు లేదా సందర్శకులకు వీసా ఓవర్‌స్టే జరిమానాలను రద్దు చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రకటించింది. "ఈ ప్రాంతంలోని అసాధారణ పరిస్థితుల" కారణంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వైమానిక ప్రదేశాల మూసివేత, విమాన సర్వీసుల సస్పెన్షన్ల కారణంగా ఇరాన్‌కు తిరిగి వెళ్లలేని వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అర్హత ఉన్నవారు మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి ICP స్మార్ట్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా ఏదైనా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌ను సందర్శించాలన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!