విదేశాల్లో చిక్కుకున్న బహ్రెయిన్ జాతీయులు..రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు..!!
- June 18, 2025
మనామా: విదేశాలలో చిక్కుకుపోయిన అనేక మంది బహ్రెయిన్ జాతీయులను తిరిగి తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్న భూ సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా ఒక టీమ్ రాజ్యానికి చేరుకుందని తెలిపింది. విదేశాలలో ఉన్న తన పౌరుల సంక్షేమం, రక్షణకు బహ్రెయిన్ రాజ్యం నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు. అవసరమైన ప్రయాణ విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. బహ్రెయిన్ దౌత్య కార్యాలయాలు, సంబంధిత దేశాలతో సమన్వయంతో విదేశాలలో ఉన్న పౌరులను తిరిగి తీసుకురావడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇరాక్ ద్వారా తిరిగి రావాలని కోరుకునే వారు తుర్క్మెనిస్తాన్కు ప్రవేశ వీసాలు పొందడానికి సహాయం అందిస్తున్నామని, ప్రస్తుతం ఇరాన్లో చిక్కుకున్న బహ్రెయిన్ జాతీయులతో కూడా కాంటాక్ట్ అవుతున్నామని తెలిపారు. అవసరమైన మద్దతు కోసం 24 గంటల హాట్‌లైన్ (+973 17227555) అందుబాటులో ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!