ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..కువైట్ క్యాబినెట్ భేటీలో సమీక్ష..!!
- June 18, 2025
కువైట్: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్ క్యాబనెట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలో వైద్య, ఆహార సరఫరాలు, సేవలు నిరాంతరాయంగా అందేలా అన్ని మంత్రిత్వ శాఖల సన్నాహాలపై సమీక్షించారు. ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన బయాన్ ప్యాలెస్‌లో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన అన్ని మెడిసిన్స్, వైద్య సామాగ్రిని అందించడానికి తన మంత్రిత్వ శాఖ సంసిద్ధత గురించి ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి వివరించారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఖలీఫా అల్-అజీల్ ఆహార భద్రతా స్టాక్, ప్రధానంగా వ్యూహాత్మక వస్తువులు, మార్కెట్ కదలికను పర్యవేక్షించే మార్గాలు, ఫుడ్, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. అదే విధంగా ప్రాంతీయంగా నెలకొన్ని సంఘర్షణ కారణంగా తలెత్తే అంశాలపై సమీక్షించారు. అత్యవసర పరిస్థితులు వస్తే.. అందుకు తగ్గట్టుగా సంసిద్ధంగా ఉండాలని, ఇందులో ముందుగానే సన్నాహాలను ముమ్మరం చేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ