పన్ను వసూళ్ల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..
- June 19, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆదాయ వనరులపై దృష్టిసారించారు. పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, వ్యవస్థలో లొసుగులు వాడుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కానీ, నిబంధనలకు కట్టుబడి పన్నులు చెల్లించే వ్యాపారులకు వేధింపులు తగదని సూచించారు.పన్ను చెల్లింపుదారులపై భయంగా కాకుండా, అవగాహనతో ముందుకు రావాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. 2017 తర్వాతి పన్ను డేటాను విశ్లేషించి, ఎక్కడ తగ్గుదల ఉందో గుర్తించాలని ఆదేశించారు. పన్ను ఎగవేతలపై ప్రోత్సాహకాలకు పునర్విమర్శ జరుగుతుందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆదాయ లక్ష్యాల పై సీఎం దృష్టి
2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1.24 లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆదాయం పెరిగితే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మరింత ఊపునిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లపై జిల్లాల జాయింట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.చిత్తూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు వాణిజ్య పన్నుల అధికారులను సీఎం అభినందించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో పడిందని పేర్కొన్నారు. విశాఖ, విజయవాడలపై ఆదాయ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వసూళ్లు స్పష్టంగా పెరిగాయి. ఏప్రిల్‌లో రూ.906 కోట్లు, మేలో రూ.916 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. గడిచిన ఏడాది ఇదే సమయంలో రూ.663 కోట్లు, రూ.583 కోట్లు మాత్రమే వచ్చాయి. జీఎస్టీ ఆదాయం 5.71 శాతం పెరిగింది.
మద్యం, గనుల శాఖల పట్ల దృష్టి
నూతన మద్యం విధానం వల్ల రూ.2,432 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. గనుల శాఖలో ఉపగ్రహ సమాచారం ఆధారంగా డేటా సేకరణకు సీఎం ఆదేశించారు.ఆదాయవృద్ధిలో ప్రతిభ కనబరిచే అధికారులకే కీలక పదవులు ఇచ్చేలా సీఎం సూచించారు. ప్రజలకు సులభంగా ఉండే సేవలే ప్రభుత్వ నైతిక బలం అని వ్యాఖ్యానించారు. రెవెన్యూకు కొత్త మార్గాలు అన్వేషించాలన్నదే చంద్రబాబు దిశానిర్దేశం.
తాజా వార్తలు
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!