544 మిలియన్ దిర్హామ్‌ల డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు అనుమతి
- July 13, 2016
544 మిలియన్ దిర్హామ్‌ల విలువ చేసే పలు రోడ్లు మరియు ఇన్‌ప్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ - ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లభించింది. అబుదాబీ ప్రభుత్వ స్ట్రాటజిక్ ప్లాన్స్‌లో భాగంగా ఈ ప్రాజెక్టులను ఆమోదించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఛైర్మన్ సయీద్ ఈద్ అల్ గాఫ్లి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటికి ఆమోదం లభించింది. మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ రోడ్లు మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అంతర్గత రోడ్లు, వాటర్, సీవెజ్, ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్స్, పబ్లిక్ అమెనిటీస్ వంటివి ఇందులో భాగం. ఇరిగేషన్ మరియు రైన్ డ్రైనేజ్ సిస్టమ్, అంతర్గత రోడ్లపై స్ట్రీట్ లాంప్స్ వంటివి కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉంటాయి. 36 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో వెస్టర్న్ రీజియన్‌లో సైన్ బోర్డుల ఏర్పాటు, నిర్వహణ చేపట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వీటిని రూపొందిస్తారు. అల్ ఫలాహ్ రోడ్ ఇంటర్ ఛేంజ్ నుండి ఖాసర్ అల్ బహర్ ఇంటర్ ఛేంజ్ వరకు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ రోడ్ అభివృద్ధి కోసం 4.5 మిలియన్ దిర్హామ్‌లు ఖర్చు చేయనున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







