దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు..
- June 20, 2025
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతల ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా ఇప్పుడు మూడో విడత ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ల గడువు కూడా నిన్నటి (జూన్ 19)తో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేశారు.
జూన్ 25 వరకు పొడిగింపు:
దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును జూన్ 25 తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి జూన్ 28వ తేదీన సీట్లను కేటాయింపు జరుగుతుంది. అనంతరం జూన్ 28 నుంచి 30 తేదీలలో ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి, జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య అలాట్ అయిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన వెంటనే.. జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కు సంబందించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల ప్రవేశాలు పూర్తయ్యాక కూడా సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.
దోస్త్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకొండి:
- దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
- ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తి చేయాలి.
- తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
- దోస్త్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్ణయించిన ఫీజును చెల్లించాలి
- తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- తర్వాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
- ఇంటర్ లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!