దానగుణంలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు..

- July 13, 2016 , by Maagulf
దానగుణంలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు..

దానగుణంలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు. ఫోర్బ్స్‌ దాతృత్వ జాబితాలో అయిదుగురు భారతీయులకు చోటు దక్కింది. 'ఫోర్బ్స్‌ ఏషియా యాన్యువల్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంథ్రపీ' పేరుతో ఫోర్స్బ్ ప్రకటించిన ఈ జాబితాలో సంపర్క్ ఫౌండేషన్ ,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బెయిన్ ఇండియా, జై వకీల్ ఫౌండేషన్ అధిపతులు చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు దంపతులు వుండడం విశేషం. వీరితో పాటు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన మొత్తం 13 దేశాలకు చెందిన 40 మంది దాతలు చోటు చేసుకున్నారు.భారతీయుల విషయానికొస్తే సంపర్క్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు వినీత్‌ నాయర్‌-అనుపమా నాయర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ ఆదార్‌ పూనావాలా, బెయిన్‌ ఇండియా సీఈఓ అమిత్‌ చంద్ర, ఆయన భార్య, జై వకీల్‌ ఫౌండేషన్‌ అర్చనా చంద్రలు జాబితాలో ఉన్నారు. నాయర్‌ కుటుంబానికి చెందిన దాదాపు సగ భాగం సంపద సంపర్క్‌ ఫౌండేషన్‌లోనే ఉంది. ఈ ఫౌండేషన్‌ ద్వారా పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమవడానికి సహకరించే కిట్లను పంచుతోంది. ఇప్పటిదాకా ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గడ్‌లోని 50,000 ప్రభుత్వ పాఠశాలల్లోని 30 లక్షల విద్యార్థులకు వీటిని అందజేసింది.100 మిలియన్ డాలర్లను దానం చేసి, ఫోర్బ్స్ లో ప్లేస్ కొట్టేసింది.గతేడాది పుణె నగరాన్ని శుభ్రం చేయడానికి 15 మిలియన్‌ డాలర్ల(రూ.97.5 కోట్లు)ను ఇస్తున్నట్లు ఆధార్‌ పూనావాలా ప్రకటించారు.బెయిన్‌ ఇండియా సీఈఓ అమిత్‌ చంద్ర, జై వకీల్‌ ఫౌండేషన్‌ సీఈఓ అర్చనా చంద్ర దంపతులు ఏటా తమ ఆదాయాల్లో 75 శాతాన్ని విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు కొన్ని రంగాల కోసం కేటాయిస్తారు. ముంబై నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద చిన్న పిల్లల ఆసుపత్రికి సైతం వీరు నిధులు సమకూరుస్తున్నారు.జాబితాలో చోటు చేసుకున్న వారిలో చైనాకు చెందిన టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌, సీఈఓ పోనీ మా కూడా ఉన్నారు. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ టెన్సెంట్ హోల్డింగ్స్ 100 మిలియన్ల షేర్లను 100 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.650 కోట్లు)ను టెన్సెంట్‌ ఫౌండేషన్‌కు ఇచ్చారు.దక్షిణ తైవాన్‌లో గత ఫిబ్రవరిలో వచ్చిన భూకంప బాధితుల కోసం 6 మిలియన్‌ డాలర్లను తైవాన్‌కు మొగల్ గా పేరొందిన హాన్‌ హాయ్‌ ప్రెసిషన్‌ ఛైర్మన్‌, సీఈఓ టెర్రీ గౌ దానం చేశారు. మొత్తం ఈయనకున్న ఆస్తిలో 90 శాతాన్ని 6 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.40,000 కోట్లు) సమాజం కోసమే వినియోగిస్తానని 2013లో ఈయన ప్రతిజ్ఞ చేశారు. కాగా గత ఏడాదిలో భూరి విరాళాలు చేసిన దాతలతో పాటు, విలువైన కారణాలతో ప్రజలతో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఫోర్బ్స్ ఆసియా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com