అనేక దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..!!

- June 20, 2025 , by Maagulf
అనేక దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..!!

యూఏఈ: పలు కారణాలతో ఎయిర్ ఇండియా అనేక దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. దుబాయ్ నుండి భారతదేశానికి రెండు సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వీటిలో దుబాయ్ నుండి చెన్నైకి AI906 సర్వీస్, దుబాయ్ నుండి హైదరాబాద్‌కు AI2204 సర్వీసులను రద్దు చేసింది. 

అదే సమయంలో ఢిల్లీ నుండి మెల్‌బోర్న్‌కు AI308, పూణే నుండి ఢిల్లీకి దేశీయ సర్వీస్ AI874; అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి AI456; హైదరాబాద్ నుండి ముంబైకి AI-2872;  చెన్నై నుండి ముంబైకి AI571 రద్దైన వాటిలో ఉన్నాయి.

గత వారం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత జరుగుతున్న భద్రతా తనిఖీలు,  కార్యాచరణ కారణంగా పలు సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు దాని వైడ్‌బాడీ విమానాల అంతర్జాతీయ కార్యకలాపాలను 15% తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com