నేషనల్ మ్యూజియంలో “నియో-రష్యన్ స్టైల్” ఎగ్జిబిషన్..!!

- June 20, 2025 , by Maagulf
నేషనల్ మ్యూజియంలో “నియో-రష్యన్ స్టైల్” ఎగ్జిబిషన్..!!

మస్కట్: "ది రష్యన్ సీజన్స్" లో భాగంగా నేషనల్ మ్యూజియం.. స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం సహకారంతో నిర్వహిస్తున్న "నియో-రష్యన్ స్టైల్" ప్రదర్శనను వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్ ప్రారంభించారు. నవంబర్ 2వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. అనేక దశాబ్దాల క్రితం ఏర్పడిన కళలో "రష్యన్ శైలి"ని తెలియజేయనున్నారు. 1880లు - 1910లలో రష్యన్ సామ్రాజ్యం కళాత్మక జీవిత చరిత్రలో భాగమైన వస్తువులు, చరిత్ర, సాంస్కృతికి ఆనవాళ్లను ప్రదర్శనకు పెట్టారు. రష్యన్ చివరి చక్రవర్తులు అలెగ్జాండర్ III,  నికోలస్ II పాలనలో నియో-రష్యన్ శైలి లక్షణాలు మాస్కోలోని సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యాలోని పెద్ద -చిన్న ప్రాంతీయ పట్టణాల నిర్మాణంలో, పెయింటింగ్, శిల్పాలు, అలంకార,  కళలు, రచనలలో భాగమైంది.

నేషనల్ మ్యూజియం సెక్రటరీ జనరల్ జమాల్ హసన్ అల్ మూసావి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం రష్యన్ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జరుగుతుందన్నారు. సాంస్కృతిక దౌత్యంలో భాగంగా రష్యన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో పనిచేస్తున్నట్లు తెలిపారు.  

ఒమాన్ సుల్తానేట్‌లో రష్యన్ ఫెడరేషన్ రాయబారి ఒలేగ్ వ్లాదిమిరోవిచ్ లెవిన్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన 19వ శతాబ్దం చివరి, 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యన్ సంస్కృతి కాలంలోని అంశాలను తెలియజేస్తుందన్నారు.   రష్యన్ ఫెడరేషన్ -ఒమన్ సుల్తానేట్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ప్రదర్శన ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com