ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం...
- June 20, 2025
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భారతీయ విద్యార్థుల అత్యవసర తరలింపు కోసం ఇరాన్ తన మూసివేసిన గగనతలాన్ని తెరిచింది.
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ గగనతలం ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. అయితే, భారతీయులను సురక్షితంగా తరలించడానికి ఇరాన్ ప్రత్యేక ఎయిర్ కారిడార్‌ను అందించినట్లు ప్రకటించింది.
ఈ పరిణామాల మధ్య భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధు’ ద్వారా ఇరాన్‌లో చిక్కుకుపోయిన కనీసం 1,000 మంది భారతీయ విద్యార్థులు వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఈ తరలింపులో భాగంగా మొదటి విమానం ఈ రోజు రాత్రి 11:00 గంటలకు (IST) ఢిల్లీలో ల్యాండ్ కానుంది. అనంతరం మరో రెండు విమానాలు (ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం) శనివారం బయలుదేరనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!