సినిమా రివ్యూ: ‘8 వసంతాలు’
- June 20, 2025
కొత్త నటీనటులతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించిన చిన్న సినిమానే ‘8 వసంతాలు’చిన్న సినిమా అయినా ప్రమోషన్లు గట్టిగా చేశారు. మరి, ప్రమోషన్లకు తగ్గట్లుగా సినిమాలో విషయం వుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే అభిమానంగా పెరుగుతుంది. అంతేకాదు. వయసుతో పాటూ తనలోని కవయిత్రిని కూడా పెంచి పోషిస్తుంది. అలా టీనేజ్‌లోనే ఓ పుస్తకం రచిస్తుంది. ఓ పక్క కవిత్వం, మరో పక్క మార్షల్ ఆర్ట్స్‌లోనూ శుద్ధి రాణిస్తుంది. మంచి టేస్ట్ వున్న అమ్మాయి. ట్రావెల్‌నీ ఆస్వాదిస్తుంది. ఇలాంటి అరుదైన భావాలున్న శుద్ధి జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి)వస్తాడు. తొలి చూపులోనే శుద్ధితో లవ్‌లో పడతాడు. కానీ, అతని ప్రేమని అంగీకరించడానికి శుద్ధి కాస్త టైమ్ అడుగుతుంది. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వీరిద్దిరి ప్రేమ కథలో కొన్ని మలుపులు చోటు చేసుకుంటాయ్. ఈ లోపు శుద్ధి జీవితంలోకి మరో కుర్రాడు సంజయ్ (రవి దుగ్గిరాల) వ స్తాడు. మరి, శుద్ధి తన మొదటి ప్రేమనే దక్కించుకుంటుందా.? లేక దొరికిన ప్రేమతోనే సరిపెట్టుకుంటుందా.? తెలియాలంటే ‘8 వసంతాలు’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ట్రయాంగిల్ లవ్ స్టోరీలా తోచినప్పటికీ ఇదో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమాకి మెయిన్ సోల్ అనంతికనే. శుద్ధి పాత్రలో ఆమె అందం, హావ భావాలు.. అద్శుతంగా ఆకట్టుకుంటాయ్. ఈ జనరేషన్‌కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోగల సత్తా వున్న యంగ్ హీరో వరుణ్ పాత్ర పోషించిన హనురెడ్డి. సంజయ్ పాత్ర పోషించిన రవి దుగ్గిరాల కూడా తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు వారి వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
హీరోయిన్ అందాన్నీ, ఆమె టాలెంట్‌నీ బాగా వాడుకున్నాడు ఈ సినిమా కోసం దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి. సినిమాని మొత్తం చాలా భావుకతతో కవితాత్మకంగా తెరకెక్కించాడు .అయితే, భావుకత మీద పెట్టిన ఫోకస్ కథనాన్ని ఇంకాస్త ప్రభావవంతంగా నడిపించడంలోనూ పెట్టి వుంటే బావుండేది. ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ విజువల్స్. కశ్మీర్ అందాల్ని కెమెరాలో క్యాప్చర్ చేసి, స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతారు. విజువల్స్ చూసేందుకు ఖచ్చితంగా ఈ సినిమా ఓ అద్భుత కావ్యమే. మరో ప్లస్ పాయింట్ హెషాబ్ అబ్ఢుల్లా మ్యూజిక్ పనితనం. అందమైన లొకేషన్లని ఆనందంగా ఆస్వాదించడానికి హెషాబ్ అందించిన మ్యూజిక్ ఆహా అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో కొన్ని చిన్నా, చితకా లోపాలున్నప్పటికీ, భావుకతతోనే ఈ సినిమాని నడిపించాలన్న దర్శకుడి పట్టును, నమ్మకాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఆ తరహా టేస్ట్ వున్న ప్రేక్షకుడికి ఈ సినిమా ఆస్వాదించదగ్గదే. మగవారి ప్రేమ కోసం పాలరాతి కట్టడాలు గట్రా జ్ఞాపకాలుగా వున్నాయ్ చరిత్రలో.. కానీ ఆడవారి ప్రేమకు చిహ్నాలుగా ఏమున్నాయ్.. మనసులో ఆ ప్రేమని అలా సమాధి చేసుకోవడమే తప్ప.. అనే అర్ధం వచ్చేలా కొన్ని డైలాగులు.. ‘జీవితంలో ప్రేమ ఒక దశ మాత్రమే అదే దిశ కాదు..’ లాంటి చాలా హత్తుకునే డైలాగులు కవితాత్మకంగా ఈ సినిమాలో చాలానే చెప్పించాడు దర్శకుడు.. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమా కోసం పని చేశారు.
ప్లస్ పాయింట్స్:
హీరోయిన్ అనంతిక, అందం, అభినయం,, ఫస్టాఫ్, విజువల్స్, మ్యూజిక్, సంభాషణలు..
మైనస్ పాయింట్స్:
కొద్దిగా స్లో అయినట్లుగా అనిపించిన సెకండాఫ్, ఆకట్టుకోని భావోద్వేగాలు..
చివరిగా:
ఓ అందమైన ఆహ్లాదకరమైన అనుభవం ’8 వసంతాలు’.!
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!