కువైట్ లో కస్టమ్స్ చెకింగ్ వ్యవస్థ బలోపేతం..!!
- June 21, 2025
కువైట్: కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నువైసీబ్ పోర్టులో కొత్త అధునాతన ప్యాలెట్ చెకింగ్ పరికరాన్ని ప్రారంభించింది. ఇది మొత్తం తనిఖీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని, భద్రతా చర్యలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. కస్టమ్స్ కార్యకలాపాలను ఆధునీకరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ కొత్త చెకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే కొత్త పరికరం కస్టమ్స్ తనిఖీలను మెరుగుపరచడంతోపాటు అక్రమ రవాణాను నిరోధిస్తుందన్నారు. షువైఖ్ పోర్టు, దోహా పోర్టు, ఎయిర్ కార్గో కస్టమ్స్, సులైబియా, వెజిటబుల్ మార్కెట్ కస్టమ్స్ కార్యాలయాలు వంటి ఇతర కీలక కస్టమ్స్ ప్రదేశాలలో ఇలాంటి పరికరాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







