రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ

- June 22, 2025 , by Maagulf
రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్‌కు సేవలందించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ ప్రవేశంపై నెమ్మదిగా వస్తున్న వార్తలపై చెక్ పెట్టారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. కానీ, భారత జట్టుకు కోచ్‌గా మారే అవకాశాన్ని మాత్రం ఖండించలేదు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలపై స్పందించారు.2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ దీనిపై ఆయన స్పష్టంగా స్పందించారు. నాకు రాజకీయాల్లో ఆసక్తి లేదు. ముఖ్యమంత్రి పదవిని కూడా ఎవరు ఇస్తారన్నా, నా నిర్ణయం మారదు, అంటూ గంగూలీ ధృవీకరించారు.

భారత జట్టు కోచ్ బాధ్యతలపై సంకేతాలు
తాను కోచింగ్ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన ఇప్పటివరకు లేదని చెప్పారు. 2013లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పా. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మహిళా క్రికెట్‌ను బలోపేతం చేయడం పెద్ద గౌరవం అని చెప్పారు. కానీ, కోచ్ బాధ్యతలు వస్తే తాను వెనకడుగు వేయనని గంగూలీ సంకేతాలిచ్చారు. నా వయసు 53. భవిష్యత్తు ఏం తెస్తుందో చూడాలి, అన్నారు.

ప్రస్తుత భారత కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరును ప్రశంసించారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఓటముల తర్వాత టీమ్ పుంజుకుంది.ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్ కీలకం, అని అభిప్రాయపడ్డారు. గంభీర్ శైలి గురించి మాట్లాడుతూ, ఆత్మవిశ్వాసంతో, స్పష్టంగా వ్యవహరిస్తాడు. అతను లోపల ఎలా ఉంటాడో, బయట అలానే కనిపిస్తాడు, అన్నారు. నా కెప్టెన్సీ రోజుల్లో గంభీర్‌తో కలిసి ఆడా.అతనికి సీనియర్ల పట్ల గౌరవం ఉంది. ఇప్పటికీ బాధ్యతల పట్ల అంకితభావంతో ఉన్నాడు అని గుర్తు చేశారు.ఇంగ్లాండ్ టూర్ అతనికి మైలురాయి. ఇబ్బందులు ఎదురైనా గంభీర్ మెరుగవుతాడు అని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com