ఆన్‌లైన్‌లోకి బహ్రెయిన్ స్కూల్స్.. 'అవసరమైతేనే' ప్రజలు బయటకు రావాలి..!!

- June 23, 2025 , by Maagulf
ఆన్‌లైన్‌లోకి బహ్రెయిన్ స్కూల్స్.. \'అవసరమైతేనే\' ప్రజలు బయటకు రావాలి..!!

బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధవాతావరణం పెరగడంతో బహ్రెయిన్ అప్రమత్తమైంది. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది. కిండర్ గార్టెన్‌లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా బహ్రెయిన్‌లోని అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యా సంస్థలు టీచింగ్ ను డిజిటల్ , ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.  

ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత, ముందు జాగ్రత్త చర్యగా విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆన్‌లైన్ లెర్నింగ్ చేపట్టాలని జారీ చేసింది.

పౌరులు, నివాసితులు ప్రయాణాన్ని పరిమితం చేసుకోవాలని,  ప్రధాన రహదారులను "అవసరమైనప్పుడు మాత్రమే" ఉపయోగించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.   

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులను పరిగణనలోకి తీసుకుంటే.. బహ్రెయిన్ సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో రిమోట్ వర్కింగ్ సిస్టమ్‌ను యాక్టివ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  70 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేందుకు అనుమతి ఇచ్చింది.  

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు.. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్‌లపై అమెరికా దాడులు చేసిన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో "ఎటువంటి రేడియోధార్మిక ప్రభావాలు కనుగొనబడలేదు" అని సౌదీ నియంత్రణ అధికారులు తెలిపారు.  కువైట్ నేషనల్ గార్డ్ Xలో కువైట్ గగనతలం, జలాల్లో రేడియేషన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని మరియు పరిస్థితి సాధారణంగా ఉందని కూడా పోస్ట్ చేసింది.మరోవైపు బాంబు దాడి తర్వాత నివేదించబడిన ఆఫ్-సైట్ రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదల లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com