ఖతార్‌పై ఇరాన్ దాడి..యూఏఈలోని అల్ దఫ్రా స్థావరంలో యూఎస్ సైన్ అప్రమత్తం..!!
- June 24, 2025
యూఏఈ: ఖతార్‌లోని అల్ ఉదీద్లోని అమెరికా సైనిక స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలోని యూఎస్ బేస్ క్యాంప్ అప్రమత్తం అయింది. అబుదాబిలోని అల్ దఫ్రాలో ఉన్న (వారి) వైమానిక దళాల ప్రాణాలకు మరియు భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వైమానిక దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ (AFCENT) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది ఖతార్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టంతోపాటు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ తన ఎయిర్ స్పేస్ ను రద్దు చేసింది. దాంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా