అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!

- June 24, 2025 , by Maagulf
అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!

దోహా, ఖతార్: అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రధానమంత్రి సలహాదారు,  విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ  తన X ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఖతార్ రాష్ట్ర సార్వభౌమాధికారం, దాని గగనతలం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా..నేరుగా స్పందించే హక్కు ఖతార్‌కు ఉందన్నారు.

ఖతార్ వైమానిక రక్షణ దళాలు ఇరాన్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ఇరానియన్ క్షిపణులతో నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రతరమైన సైనిక చర్యలు కొనసాగడం వల్ల ఈ ప్రాంతంలో భద్రత దెబ్బతింటుందని, అంతర్జాతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు. అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని, వెంటనే దౌత్య మార్గంలో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com