అమెరికా పౌరులు, ఇతర నివాసితులకు ఖతార్ సేఫ్..!!
- June 24, 2025
ఖతార్: కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితిలు నియంత్రణలో ఉందని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ప్రధాన మంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఏ దేశ పౌరులకు ఎటువంటి అభద్రత భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఖతార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం అమెరికన్ పౌరులకు ఒక ఇమెయిల్ పంపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు వారు ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత ఈ అడ్వైజ్ జారీ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఖతార్ అధికారి పౌరులు, నివాసితులు ఇద్దరికీ భద్రతా సేవలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఖతార్.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. వెంటనే అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి.. చర్చలు, దౌత్య మార్గాలకు రావాల్సిన అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా