ఉద్యోగులకు రిమోట్ వర్క్ ప్రకటించిన అజ్మాన్..!!
- June 24, 2025
యూఏఈ: అజ్మాన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుండి ఆగస్టు 22 వరకు రిమోట్ పనిని ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ శుక్రవారం రిమోట్‌గా పని చేస్తారని, వారపు రోజుల పని గంటలు ఒక గంట తగ్గుతాయని తెలిపారు. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు పని చేస్తారు. అయితే, అవసరమైన ప్రజా సేవలను అంతరాయం లేకుండా అందించడానికి అనువైన అంతర్గత ఏర్పాట్లను అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త చొరవను క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి నాయకత్వంలోని అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ నిర్ణయం అజ్మాన్ ప్రభుత్వం సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుందని షేక్ అమ్మర్ చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం దుబాయ్ కూడా సౌకర్యవంతమైన పని గంటల విధానాన్ని ప్రకటించింది. ఈ చొరవ జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!