వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానం..
- June 24, 2025
అతి త్వరలోనే ఎలక్ట్రిక్ విమానాలు ఎగరనున్నాయి.ప్రపంచంలోనే తొలిసారిగా ఈవీ ప్లాన్ నలుగురు ప్రయాణికులతో గాల్లోకి (EV Plane) ఎగిరింది. కేవలం 8 డాలర్లు అంటే.. దాదాపు రూ. 694 ఖర్చుతో ఎలక్ట్రిక్ విమానం 130 కిలోమీటర్లు ప్రయాణించింది.
అమెరికాకు చెందిన కంపెనీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా 4 ప్రయాణికులతో గమ్యస్థానానికి చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విమాన ప్రయాణ రంగంలో గేమ్-ఛేంజర్ అని చెప్పొచ్చు.
ప్రయాణీకులను తీసుకెళ్లే ఎలక్ట్రిక్ విమానం జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. టెస్ట్ ఫ్లైట్ కాదు.. నలుగురు ప్రయాణికులను తీసుకెళ్లింది. బీటా టెక్నాలజీస్‌కు చెందిన CX 300 విమానం ఈ హిస్టరీని క్రియేట్ చేసింది.
ఎంత సమయంలో ఎంత దూరమంటే? (EV Plane):
ఈ నెల ప్రారంభంలో ఎలక్ట్రిక్ విమానం తూర్పు హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయానికి దాదాపు అరగంటలో దాదాపు 70 నాటికల్ మైళ్లు (130 కిలోమీటర్లు) దూరాన్ని అధిగమించిందని ఫాక్స్ న్యూస్ నివేదించింది. బీటా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ కైల్ క్లార్క్ మాట్లాడుతూ.. 100 శాతం ఎలక్ట్రిక్ విమానంగా పేర్కొన్నారు.
‘‘ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయానికి ప్రయాణికులతో ప్రయాణించాం.. 35 నిమిషాల్లో 70 నాటికల్ మైళ్ల దూరాన్ని అధిగమించాం. భవిష్యత్ ప్రయాణాలకు ఇది చాలా ముఖ్యం. ఇలాంటి ఎలక్ట్రిక్ విమానాలు విమాన ప్రయాణ సమయంలో శబ్దం చేయవు. నడపడానికి కూడా చాలా చౌకగా ఉంటాయి. ఛార్జ్ చేసి ఈవీ విమానం ఎగరడానికి దాదాపు 8 డాలర్ల ఇంధనం ఖర్చవుతుంది’’అని క్లార్క్ అన్నారు.
అయితే, పైలట్, విమానానికి మాత్రం చెల్లించాలి. అది కూడా చాలా చౌకగానే ఉంటుంది. ఇంజిన్లు, ప్రొపెల్లర్లు అసలు శబ్దం చేయవు. ప్రయాణీకులు విమాన సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.
ఇలాంటి ప్రయాణానికి సాధారణంగా ఇంధనం మీద మాత్రమే రూ.13,885 (సుమారు 160 డాలర్లు) కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. రవాణా సంస్థలు ఇప్పటికే చిన్న ప్రయాణాలకు విద్యుత్ బ్యాటరీతో నడిచే విమానాల కోసం చూస్తున్నాయి. ప్రయాణీకులు ట్రాఫిక్‌ను నివారించడంతో పాటు ఉద్గారాల ప్రభావం కూడా తగ్గుతుంది.
2017లో స్థాపించిన బీటా టెక్నాలజీస్, ఇటీవల ఎలక్ట్రిక్ విమానాల కోసం 318 మిలియన్ డాలర్లను సేకరించింది. మొత్తం నిధులు 1 బిలియన్ డాలర్లకు పైగా చేరుకున్నాయి.
గత 6 ఏళ్లుగా కంపెనీ సాంప్రదాయ టేకాఫ్, ల్యాండింగ్ CX300 మోడల్ వంటి అలియా 250 eVTOL రెండింటిపై పని చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) సర్టిఫికేషన్ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్చర్ ఏవియేషన్ ఇంకా FAA ద్వారా ధృవీకరించలేదు. కంపెనీ తన LA నెట్వర్క్ కార్యకలాపాలను 2026 నాటికి ప్రారంభించాలని భావిస్తోంది.
CX 300 ఈవీ విమానం ఫీచర్లు:
- 100 శాతం విద్యుత్ విమానం, తక్కువ ఖర్చుతో ఎగరగలదు.
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 250 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదు.
- నగరాలు, శివారు ప్రాంతాల మధ్య చిన్న ప్రయాణాలకు సరైనది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!