అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- June 26, 2025
మనామా: ఈ నవంబర్‌లో జరిగే అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(AICS 2025) కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది.క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో.. బహ్రెయిన్ అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ , ఎగ్జిబిషన్ (AICS 2025) 3వ ఎడిషన్‌ను నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమం నవంబర్ 5 నుండి 6 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది.నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నిర్వహించే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు, నిర్ణయాధికారులు మరియు ప్రతినిధులు పాల్గొంటారు.
AICS 2025లో ఒక హై-ప్రొఫైల్ టెక్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. తాజా ఆవిష్కరణలు, సమస్యలు- పరిష్కారాలు, సాంకేతికతలను ప్రదర్శించే ప్రముఖ అంతర్జాతీయ సైబర్ భద్రతా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. డిజిటల్ టెక్నాలజీలో తాజా ఆవిష్కరణలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్‌ను మారుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!