AI-ఆధారిత ట్రాఫిక్ కెమెరాలతో అబుదాబిలో రోడ్లు సురక్షితం..!!

- June 26, 2025 , by Maagulf
AI-ఆధారిత ట్రాఫిక్ కెమెరాలతో అబుదాబిలో రోడ్లు సురక్షితం..!!

యూఏఈ: AI-ఆధారిత ట్రాఫిక్ కెమెరాలతో అబుదాబిలో రోడ్లు సురక్షితంగా మారాయని అబుదాబి పోలీస్ టెలికమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ హమద్ ఖలీఫా అల్ నుయిమి తెలిపారు. దుబాయ్‌లో ఖలీజ్ టైమ్స్ నిర్వహించిన ఫ్యూచర్‌సెక్ సమ్మిట్ 2025లో  ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమిరేట్ ట్రాఫిక్ వ్యవస్థలలో కృత్రిమ మేధస్సు ప్రమాదాలు జరగడానికి ముందే అది ఎలా తగ్గిస్తుందో వివరించారు.

“క్లిష్టమైన వ్యవస్థలు ఇకపై బ్యాక్-ఎండ్ సర్వర్లలో మాత్రమే కాదు, అవి రోడ్లపై ఉన్నాయి” అని డాక్టర్ అల్ నుయిమి అన్నారు. “అబుదాబిలో, మీరు లేన్ల మధ్య లేదా టెయిల్‌గేటింగ్ వంటి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుంటే, AI-ఆధారిత కెమెరాలు రియల్ టైమ్ లో దానిని గుర్తించి ఫ్లాగ్ చేస్తాయి. ఈ ఉల్లంఘనలు కేవలం జరిమానాలు జారీ చేయడమే కాదు. అవి ఢీకొనడం జరగకముందే నిరోధిస్తాయి.” అని వివరించారు. “డ్రైవర్లను శిక్షించడం మాత్రమే కాదు.. రోడ్లను సురక్షితంగా చేయడమే లక్ష్యం. జీవితాలను రక్షించడానికి మేము AI సాంకేతికతను ఈ విధంగా ఉపయోగిస్తున్నాము.” అని ఆయన అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com