ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: సీఎం చంద్రబాబు
- June 26, 2025
అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నతవిద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ మేరకు సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘కృత్రిమ మేధ (AI) ఉపయోగించి రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని నైపుణ్యం పోర్టల్లో పొందుపర్చాలి.
యువతకు ఈ సమాచారం అందేలా చూడాలి. యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిగా రెజ్యూమే వచ్చేలా పోర్టల్ డిజైన్ చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం.
వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను సైతం అంచనా వేయాలి’ అని సూచించారు.
‘ఎపి యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాలు లభించే లక్ష్యంతో పని చేయాలి. జర్మనీ, ఇటలీ, సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం, నిర్మాణం, పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్స్, ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాలి.
ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్, ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఆంగ్లంతో పాటు విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి మంత్రి నారా లోకేష్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!