ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!

- October 12, 2025 , by Maagulf
ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!

మనామా:  ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ విభాగంలో బహ్రెయిన్ ల సంఖ్యలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అదే సమయంలో అరబిక్, ఇస్లామిక్ విద్య మరియు సామాజిక అధ్యయనాలలో లోకలైజేషన్ కు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను బహ్రెయిన్ పునరుద్ఘాటించింది.

విదేశీ కార్మికుల అనుమతుల నుండి వసూలు చేస్తున్న 80% రుసుములను తమ్కీన్ లేబర్ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ ఉపాధిని పెంచడానికి, పౌరులకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యాపరంగా మరియు వృత్తిపరంగా అర్హత కలిగిన బహ్రెయిన్ విద్యావేత్తలను ఆకర్షించడానికి అధికారులు చురుకుగా పనిచేస్తున్నాని తెలిపింది.  ప్రైవేట్ స్కూళ్లలో అర్హత కలిగిన స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇందులో భాగంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజ్ నుంచి ప్రొఫెషనల్ టీచింగ్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే బహ్రెయిన్ల సంఖ్యను గణనీయంగా పెంచిందన్నారు. విద్యతో సహా ప్రైవేట్ రంగ కార్యకలాపాలలో తప్పనిసరిగా స్థానికీకరణ కోటాను పూర్తి చేయాలని, లేదంటే అదనంగా ఉన్న ప్రతి విదేశీ కార్మికుడికి 500 బహ్రెయిన్ దినార్ల అదనపు రుసుమును ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికార యంత్రాంగం హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com