బంగాళాఖాతంలో అల్పపీడనం 4 రోజుల పాటు భారీ వర్ష సూచన

- June 26, 2025 , by Maagulf
బంగాళాఖాతంలో అల్పపీడనం 4 రోజుల పాటు భారీ వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా, తద్వారా వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.దీనితో పాటు మరో ద్రోణి కూడా ఆ ప్రాంతంలో విస్తరించి ఉండటంతో ఈ రెండింటి ప్రభావం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌ లో వర్షాల రూపంలో కనిపించనుంది.

ఏపీ జిల్లాల్లో వర్షాలు:
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరిస్తోంది. కింది జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్న జిల్లాలు:
విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం (జూన్‌ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

తెలంగాణలో ఉరుములు, మెరుపులు–తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు ప్రభావం చూపించనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈ రోజు నుంచి 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ప్రభావిత జిల్లాలు:
ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు–ఇద్దరు మృతి, 15+ మంది గల్లంతు
రుతుపవనాల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు పడుతూ ఉంటే, ఖన్యారా ప్రాంతంలో వాగు ఒడ్డున ఉన్న తాత్కాలిక షెడ్లలో ఉన్న కార్మికులు వరద నీటిలో గల్లంతయ్యారు.
ఇప్పటికే ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా, మిగిలినవారి కోసం గాలింపు కొనసాగుతోంది.
జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో ఈ దుర్ఘటన జరిగింది.

జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు గల్లంతయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఇద్దరి మృత దేహాలను మనుని ఖాడ్ వాగు నుంచి రెస్క్యూ టీం వెలికి తీసింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆకస్మిక వరదల దాటికి ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఆపి ఉంచిన వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com