యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలో ఇవి కచ్చితంగా దెబ్బతింటాయి
- June 27, 2025
యూరిక్ యాసిడ్.. ప్యూరిన్ విచ్ఛిన్నమై ఉప ఉత్పత్తి యూరిక్ యాసిడ్ బయటికి వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోతే దానిని హైపర్ యూరిసెమియా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కీళ్ల వాపు, నొప్పి, బాధాకరమైన గౌట్, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. ఈ కారణంగానే నడుము నొప్పి, మూత్ర సమస్యలొస్తాయి.
బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే అవి సూది లాంటి స్పటికాలుగా గట్టిపడతాయి. ఈ పదునైన స్పటికాలు కీళ్లలో స్థిరపడతాయి. ఇది గౌట్ అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. దీంతో బాధతో కూడిన ఆర్థరైటిస్ ఏర్పడుతుంది. అదనపు యూరిక్ యాసిడ్ కిడ్నీల్లో పేరుకుపోతుంది. ఈ కారణంగానే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వీటిని సరైన టైమ్‌కి గుర్తించకపోతే అసౌకర్యం, సమస్యలు ఎదురవుతాయి.
ఈ సమస్య పెరగడానికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా..ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ఒకటిఅధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ బయటికి వెళ్లడానికి కష్టంగా మారుతుంది. దీంతో లోపలే పేరుకుపోతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడంషుగర్ వంటి సమస్యలు కిడ్నీల పనితీరుని దెబ్బతీస్తాయి. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అన్‌హెల్దీ డైట్ చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన ఒంట్లో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా కొన్ని మెడిసిన్స్‌ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అవయవ మార్పిడి తర్వాత సంరక్షణకి సూచించబడతాయి. యూరిక్ యాసిడ్ జీవక్రియకి కూడా అంతరాయం కలిగిస్తాయి.
కొన్ని నివేదికల ప్రకారం హైపర్ యూరిసెమియా సాధారణంగా వెంటనే లక్షణాలను కలిగించదు. గౌట్ ఇన్‌ఫ్లమేషన్, కిడ్నీల్లో రాళ్లు సడెన్‌గా రాళ్ల వంటి తీవ్రమైన ఫలితాలను ఎదుర్కొనే వరకూ చాలా మందికి తమ యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగాయని తెలియదు. అయితే, కీళ్లలో యూరిక్ యాసిడ్ స్పటికాలు పేరుకుపోయినప్పుడు మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కీళ్లలో నొప్పి, బలహీనపరిచే నొప్పిచర్మం ఎరుపు, రంగు మారడంవాపు, కదలిక తగ్గడంతీవ్రమైన సున్నితత్వం, బెడ్‌షీట్ కూడా బాధాకరంగా అనిపించొచ్చు. ప్రభావిత ప్రాంతంలో వేడి, మంటగా అనిపించడం మూత్ర పిండాల్లో యూరిక్ యాసిడ్ పెరిగితే కొన్ని లక్షణాలు ఉంటాయి.
నడుము కింది భాగంలో ఓ వైపు నొప్పిగా ఉండడం. తీవ్రమైన అసౌకర్యం వల్ల వాంతులు, వికారం ఇన్ఫెక్షన్‌తో జ్వరం, చలి, మూత్రంలో రక్తం, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, ఇబ్బంది ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపించినప్పటికీ సరిగా మూత్ర విసర్జన కాకపోవడం మూత్రంలో వాసన వస్తాయి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా