టూవీలర్లకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
- June 27, 2025
న్యూ ఢిల్లీ: జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిదంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జులై 15 నుంచే అమల్లోకి తీసుకురానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.టూవీలర్లకు టోల్ వసూలు చేసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తప్పుబట్టారు.టోల్ పన్నుపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు. వాస్తవాలు తెలీకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది. టోల్ ఫీజు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా