దర్బ్ టోల్ గేట్ల ముందు ట్రాఫిక్ జామ్..వాహనదారుడికి Dh500 జరిమానా..!!
- June 28, 2025
అబుదాబి: టోల్ ఫీజు చెల్లించకుండా ఉండటానికి దర్బ్ గేట్ల దగ్గరకు వెళ్లే ముందు ఆగిపోవడం ప్రమాదకరమని అబుదాబి పోలీసులు వాహనదారులకు గుర్తు చేశారు. అలాంటి అక్రమంగా ఆగి ట్రాఫిక్ ను అడ్డుకుంటే దిర్హామ్‌లు 500 జరిమానా విధించబడుతుందని తెలిపారు. శుక్రవారం అబుదాబి పోలీసుల డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ పెట్రోల్స్ షేర్ చేసిన వీడియోలో.. దర్బ్ టోల్ గేట్లను దాటడానికి కొన్ని నిమిషాల ముందు చాలా మంది డ్రైవర్లు ఆగిపోవడం కెమెరాలో గుర్తించారు.
రాజధానిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడానికి దర్బ్ టోల్ గేట్ వ్యవస్థను జనవరి 2021లో తిరిగి అమలులోకి తెచ్చారు. టోల్ గేట్లలో దేనినైనా దాటే వాహనాలకు ఉదయం 7 నుండి 9 గంటల మధ్య , సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య ప్రతి లావాదేవీకి 4 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. మిగిలిన రోజుల్లో.. ఆదివారాలు, అధికారిక సెలవు దినాలలో టోల్ రుసుము వసూలు చేస్తారు.
ట్రాఫిక్ చట్టాలను పాటించాలని, అక్రమంగా ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలను నివారించాలని డ్రైవర్లకు గుర్తు చేశారు. దీనికి 500 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుంది. ఆకస్మికంగా రిటర్న్ కావడం తీవ్రమైన ట్రాఫిక్ నేరంగా భావించి, 1,000 దిర్హామ్‌ల జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. నిర్దేశిత బస్ లేన్లు లేదా పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగిస్తే 400 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







