సౌదీ అరేబియా రీ ఓపెన్.. డైలీ 1,300కి పైగా ఫైట్ సర్వీసులు..!!
- June 28, 2025
రియాద్: మిడిలీస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గడంతో సౌదీ అరేబియా తన వైమానిక ప్రాంతాన్ని తెరిచింది.దాంతో సగటున 1,330 కంటే ఎక్కువ డైలీ ఫ్లైట్స్ సర్వీసులు సౌదీ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్నాయి.ఇది మిడిలీస్ట్ సంక్షోభానికి ముందు ట్రాఫిక్ స్థాయిల కంటే దాదాపు రెట్టింపు సంఖ్య అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) తెలిపింది.
ఈ అదనపు విమానాలు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా, అత్యాధునిక సాంకేతికతలు, కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ల మద్దతుతో సురక్షితంగా నిర్వహించబడ్డాయని పేర్కొంది. సౌదీ తన గగనతల సామర్థ్యాన్ని విస్తరించిందని, అధునాతన నావిగేషనల్ సిస్టమ్‌ల ద్వారా విమాన మార్గాలను ఆప్టిమైజ్ చేస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందని తెలిపింది.
సౌదీ అరేబియా ఎయిర్ నావిగేషన్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనదని తెలిపింది. ఇందులో 20 నియంత్రణ టవర్లు, 15 రంగాలను కవర్ చేసే రెండు ప్రాంతీయ నియంత్రణ కేంద్రాల,10 అప్రోచ్ నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ నావిగేషన్ పరికరాలు మోహరించారు. వీటిని 700+ సర్టిఫైడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సహా 1,900 కంటే ఎక్కువ విమానయాన నిపుణులు విధులను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా