దుబాయ్ లో భారతీయ వ్యాపారి హత్య కేసు..ఐదుగురి పై విచారణ ముమ్మరం..!!

- June 28, 2025 , by Maagulf
దుబాయ్ లో భారతీయ వ్యాపారి హత్య కేసు..ఐదుగురి పై విచారణ ముమ్మరం..!!

దుబాయ్: దుబాయ్ లోని అల్ వుహైదా ప్రాంతంలోని విల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలో 55 ఏళ్ల భారతీయ వ్యాపారిని చంపిన ఐదుగురు వ్యక్తుల కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారించడం ప్రారంభించింది.

కోర్టు ఫైళ్ల ప్రకారం.. నిందితులు అందరూ పాకిస్తాన్ జాతీయులు. బాధితుడి విల్లాలోకి చొరబడి, అతన్ని కట్టివేసి, పదునైన వస్తువుతో గొంతు కోసి చంపారని కేసులు నమోదు చేశారు. అక్కడి నుండి నగదు, పాస్‌పోర్ట్‌లు,  ఆభరణాలను చోరీ చేశారని తెలిపారు.   

ఫోరెన్సిక్ నిపుణులు, CID అధికారులతో సహా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విల్లాలోని భద్రతా కెమెరాల ఫుటేజ్‌లో నేరం జరిగిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు ప్రవేశించినట్లు కనిపించింది. ఇరవై నిమిషాల తర్వాత, వారు చోరీ సొత్తుతో వెళ్లడం కనిపించింది. కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో బాధితుడికి అనేక గాయాలు అయ్యాయని, దాడి చేసిన వారిని ప్రతిఘటించిన తర్వాత చివరికి గొంతు కోసి చంపబడ్డాడని నిర్ధారించారు.

దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పాకిస్తాన్ లోని విమానాశ్రయంలో మరో ఇద్దరిని అరెస్టు చేసి, తరువాత యూఏఈకి తీసుకొచ్చారు.  విచారణ సమయంలో ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com