మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల ఊచకోత..!

- June 28, 2025 , by Maagulf
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల ఊచకోత..!

అమెరికా: ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్. ఇప్పటికే గత నెలలో 6వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేసిన మైక్రోసాఫ్ట్..మొత్తం సిబ్బందిలో 3శాతం మందిని తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించడం ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది.వచ్చే నెలలో మరింత మందిపై వేటు తప్పదని సత్య నాదెళ్ల హెచ్చరించడం కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా లేఆఫ్స్ కు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏఐ, ఆటోమేషన్..ఉద్యోగాల కోతకు కారణంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఖండించారు.ఏఐ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా ఒక మంచి టెక్నాలజీ నిపుణులుగా ఎదగాలంటే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లంతా బేసిక్ అంశాలపై పట్టు సాధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.హెల్త్ కండీషన్ తో పాటు పేపర్ వర్క్ వంటి రోజువారీ పనులను ఏఐ సులభతరం చేయాలన్నారు.

సామాజిక విలువలతో కూడిన శక్తి వినియోగాన్ని సమర్థించేందుకు ఏఐ వినియోగం పెంచాలని ఐటీ సంస్థలకు సత్య నాదెళ్ల సూచించారు. కృతిమ మేధస్సుతో వేగంగా మారుతున్న టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఏఐ వంటి అపారమైన శక్తిని పరిగణలోకి తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.రోజువారీ సవాళ్లను సులభతరం చేయగలదా లేదా అనేది ఏఐ విజయంతోనే సాధ్యపడుతుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com