ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి

- June 29, 2025 , by Maagulf
ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి

హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కళాలలిత కళావేదికలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి సందర్భంగా, గాయకుడు వీఆర్కే ఫణి నిర్వహణలో "నేనొక పూల మొక్కకడ నిల్చి" ప్రైవేట్ గీతాల ప్రత్యేక కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించబడింది.

ప్రధాన గాయకుడైన ఫణిని,ఘంటసాల స్వర్ణపతకంతో వంశీ రామరాజు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేఖ మూర్తి దివాకర్ల సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ ఆదినారాయణ, రవీంద్ర, నిషీజా రమణి, హృషీకేశ్, ఘంటసాల వెంకటేశ్వర రావులను సురేఖ సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వంశీ ప్రెసిడెంట్ సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ పాల్గొన్నారు.
వంశీ రామరాజు ప్రసంగిస్తూ, తమకు కరుణశ్రీ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
"వారు పుట్టిన ఊరులోనే నేను పుట్టాను" అని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో కరుణశ్రీ కుటుంబ సభ్యులు వీక్షించడం తమకు ఆనందం కలిగించిందని వంశీ రామరాజు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com