17 ఏళ్ల తర్వాత హంతకుడిపై సీబీఐ ఛార్జ్ షీట్..Dh300 కోసం యూఏఈలో మర్డర్..!!
- June 29, 2025
యూఏఈ: అబుదాబిలో ఒక భారతీయుడు హత్య కేసుకు సంబంధించి దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) హంతకుడిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేవలం Dh300 ఫోన్ బిల్లుల చెల్లింపు కోసం మర్డర్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు ఇందర్ జిత్ సింగ్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద స్థానిక ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ కేసు ఆగస్టు 28, 2008న జరిగింది. అంతర్జాతీయ సిమ్ కార్డుల వివాదం తర్వాత యూఏఈ రాజధాని అబుదాబిలో సింగ్ తోటి భారతీయుడు రామ లింగం నటేసన్‌ను కత్తితో పొడిచి చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. CBI ఛార్జిషీట్ ప్రకారం.. సింగ్ కోసం నటేసన్ క్రెడిట్‌పై సిమ్ కార్డులను సింగ్ విక్రయించేవాడు. ఈ క్రమంలో బకాయిలు Dh300కి చేరుకుంది. నటేసన్ సింగ్ తన జీతం నుండి బకాయిలను తగ్గించమని కోరినప్పుడు, సింగ్ అతన్ని చంపడానికి పథకం పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. అతను నటేసన్‌పై పదునైన కత్తితో దాడి చేసి, ప్రాణాంతకమైన గాయాలను కలిగించాడని తెలిపింది.
అనంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో యూఏఈ అధికారులు కలిసి ఆధారాలు సేకరించినట్లు CBI తెలిపింది. భారత హోం మంత్రిత్వ శాఖ అనుమతితో, ఏజెన్సీ ఇప్పుడు న్యూఢిల్లీలోని ఒక ప్రత్యేక కోర్టులో అధికారిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
మరోకేసులో.. 2011లో బహ్రెయిన్‌లో తన యజమానిని హత్య చేసినందుకు CBI మరో భారతీయుడు సుభాష్ చందర్ మహ్లాపై కూడా అభియోగం మోపింది. డ్రైవర్‌గా పనిచేసిన మహ్లా.. తన యజమానిపై ఆయుధంతో దాడి చేసినట్లు CBI తెలిపింది. అతనిపై IPC సెక్షన్లు 302, 404 కింద అభియోగాలు మోపబడ్డాయి.
యూఏఈ, బహ్రెయిన్ అధికారుల అభ్యర్థన మేరకు రెండు ప్రాసిక్యూషన్లు ప్రారంభించినట్టు తెలిపారు. విదేశాలలో జరిగిన నేరాలకు భారతీయ పౌరులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతను ఈ కేసుల పురోగతి ప్రతిబింబిస్తుందని సీబీఐ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్