మహిళ ప్రసవించే సన్నివేశం : ‘స్క్విడ్ గేమ్-3’పై విమర్శలు
- June 29, 2025
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ (OTT) ప్రేక్షకుల మనసులను దోచుకున్న సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ప్రతి సీజన్‌కి అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. అయితే, తాజాగా వచ్చిన మూడో సీజన్‌లో ఒక సన్నివేశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సీన్ వాస్తవికత లేకుండా చూపించారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఈ వివాదాస్పద సన్నివేశం సీజన్ 3లోని రెండో ఎపిసోడ్‌లో వస్తుంది. ఇందులో ‘కిమ్ జున్ హీ’ పాత్రధారి ఆకస్మికంగా ప్రసవ వేదనకు లోనవుతుంది. తోటి కంటెస్టెంట్ ‘గెమ్ జా’ సాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది. అది కూడా ఎలాంటి వైద్య సాయం లేకుండా, నొప్పులు లేకుండా. ప్రసవానంతరం ఎటువంటి అలసట కనిపించకుండా మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోతుంది.
నెటిజన్ల అసహనం ఎక్కడికి చేరిందంటే…
ఈ సన్నివేశం ప్రసారమైన వెంటనే విమర్శల తుపాను వచ్చేసింది. ‘‘నీళ్లు పోగానే బిడ్డ పుట్టింది, వెంటనే లేచి నడిచింది’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ 75 లక్షల వ్యూస్‌ను దాటింది. ‘‘ఈ బిడ్డకు కూడా సిన్సియరిటీ ఎక్కువేమో, ఏడవాల్సిన టైమ్‌కి ఏడుస్తుంది’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు మరికొందరు.
దర్శకుడి పై నిప్పులు చెరిగిన వ్యాఖ్యలు
ప్రసవం ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా దర్శకుడు ఇలా చూపించారని మండిపడుతున్నారు. వైద్య నిపుణుల గైడ్‌లైన్స్ తీసుకోకుండా చిత్రీకరించడం, మూత్రపిండాలు, రక్తస్రావం, శ్రమ తతంగాలేమీ చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. ‘‘ఇది సోమరి రచనకు నిదర్శనం’’ అంటూ నెటిజన్లు తిప్పి పొడుస్తున్నారు.
కొంతమంది మద్దతు…కానీ మెజారిటీ నిరసన
కొంతమంది ఈ సీన్‌ను ఓర్పు, జీవన జ్ఞానంగా చెబుతున్నా, చాలా మంది మాత్రం అంగీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా, ప్రసవం తర్వాత తల్లి స్కిప్పింగ్ చేయడం మరింత చర్చకు తావిచ్చింది. ఇది ‘స్క్విడ్ గేమ్’ వాస్తవికతకు దూరంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.‘స్క్విడ్ గేమ్’ తరచూ సామాజిక అంశాలపై గంభీరంగా స్పందిస్తుంటుంది. కానీ, ఇలాంటి సన్నివేశాల ద్వారా సిరీస్ మీద ప్రజల్లో విరక్తి పెరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీన్ వల్ల సిరీస్‌ను మానేస్తున్నట్లు పలువురు నెటిజన్లు ప్రకటించడం గమనార్హం.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా