హైదరాబాద్ ట్రాఫిక్ పరిష్కారానికి ‘గూగుల్ గ్రీన్‌లైట్’
- June 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాహనదారులకు ఊరటనిచ్చే మార్గం సిద్ధమవుతోంది. నగరంలోని తీవ్ర ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్ యంత్రాంగం, గూగుల్ సంస్థతో కలిసి వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ‘‘ప్రాజెక్ట్ గ్రీన్‌లైట్’’ పేరిట ప్రధాన కూడళ్ల ట్రాఫిక్‌ను సాంకేతికంగా విశ్లేషించి, రద్దీకి తగిన విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆటోమేటిక్‌గా నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సుమారు 300కి పైగా ట్రాఫిక్ జంక్షన్లు ఉండగా, 40-50 ప్రాంతాల్లో అత్యధిక రద్దీ ఉంటుంది. ఉదాహరణకు ఎల్బీనగర్, చాదర్‌ఘాట్, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, హబ్సిగూడ, బోయిన్పల్లి ప్రాంతాల్లో ఏ చిన్న ఆటంకం వచ్చినా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌తో కలిసి ట్రాఫిక్ డేటాను సమీకరించి, ఎప్పుడు ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందో శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. దాని ఆధారంగా గ్రీన్, రెడ్ సిగ్నల్స్‌కు సమయాలను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తారు. ఇంతకుముందు వాహనం ఎక్కడ ఆగిందో తెలిసేలోపే సిబ్బంది చేరడానికి ఆలస్యం అయ్యేది. ఈ సమస్యకు పరిష్కారంగా, 21 ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగులపై 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 3-4 కి.మీ వరకు రహదారుల పరిస్థితులను కంట్రోల్ రూమ్ నుంచి 24x7 నిఘా పెట్టేందుకు ఉపకరిస్తున్నాయి. సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ నేతృత్వంలో ట్రాఫిక్ శాఖ సమన్వయంతో పని చేస్తూ రద్దీ నివారణకు మరింత ముమ్మరంగా కృషి చేస్తోంది. ట్రాఫిక్ జామ్‌లు, ఆలస్యాలు ఇకమీదట వాహనదారులపై భారం కావద్దనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను నగరవ్యాప్తంగా విస్తరించనున్నారు. ముఖ్యమైన మార్గాల్లోని 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3-4 కిలోమీటర్ల దూరం వరకూ రహదారులపై పరిస్థితులను గమనించొచ్చు. కంట్రోల్‌రూమ్ నుంచి 24 గంటలు ఈ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించొచ్చు. ఫుటేజ్ ద్వారా ఫ్లైఓవర్లు, రహదారుల మధ్యలో ఆగిపోయిన వాహనాలను తొలగిస్తారు. ట్రాఫిక్ జామ్‌లకు కారణమైనటువంటి అంశాలకు తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







