మళ్లీ రోహిత్‌, పరశురామ్‌ కలయికలో...

- July 14, 2016 , by Maagulf
మళ్లీ రోహిత్‌, పరశురామ్‌ కలయికలో...

'బాణం'తో తెరపైకొచ్చాడు నారా రోహిత్‌. రెండో సినిమా 'సోలో'తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. ఇప్పుడు మళ్లీ రోహిత్‌, పరశురామ్‌ కలయికలో ఓ చిత్రం రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పరశురామ్‌. ఆ తరవాత నారా రోహిత్‌ కోసం రాసుకొన్న కథని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ''ఇదో ప్రేమకథ. వినోదం, భావోద్వేగాలూ ఉంటాయి. నారా రోహిత్‌ పాత్రని విభిన్నంగా తీర్చిదిద్దుతున్నార''ని విశ్వ సనీయ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com