అల్లరి నరేష్ 'ఆల్కహాల్'.. ఫస్ట్ లుక్ కిక్కిచ్చేలా
- June 30, 2025
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన మెహర్ తేజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 63వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘ఆల్కహాల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మిస్తున్నారు. రుహాని శర్మ కథానాయిక. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







