పీక్ అవర్స్ లో విద్యుత్తును ఆదా చేయండి..!!
- July 01, 2025
కువైట్: కువైట్ అత్యంత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నందున, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో విద్యుత్తును ఆదా చేయాలని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. విద్యుత్తును ఆదా చేయడం ఉమ్మడి బాధ్యత అని , విద్యుత్ కోతలను నివారించడంలో సహాయపడుతుందని సహల్ యాప్ ద్వారా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఒకేసారి ఎక్కువ ఉపకరణాలను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, సోమవారం విద్యుత్ లోడ్ 16,841 మెగావాట్లకు చేరుకుందని, ఇది 17,000 మెగావాట్ల పరిమితికి దగ్గరగా ఉందని పేర్కొంది. విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి, అన్ని ప్రాంతాలకు నిరంతర సరఫరాను కొనసాగించడానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!