కవర్-అప్ కేసులో సౌదీ, ఈజిప్షియన్లకు SR200,000 జరిమానా..!!
- July 01, 2025
రియాద్: దమ్మామ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కవర్-అప్ (తసత్తూర్) కేసులో దోషులుగా తేలిన తర్వాత సౌదీ పౌరుడు, ఈజిప్షియన్ నివాసికి SR200,000 జరిమానా విధించింది. తూర్పు ప్రావిన్స్లోని ఖాతిఫ్ గవర్నరేట్లో నీటి డీశాలినేషన్ కేసులో వీరిని దోషులుగా తేల్చింది.
అలాగే, కోర్టు వెలువరించిన తీర్పులో వాణిజ్య రిజిస్ట్రేషన్, లైసెన్స్ రద్దు, సంస్థ కార్యకలాపాలను రద్దు చేశారు. అదే విధంగా జకాత్, రుసుములు, పన్నులు వసూలు చేయడం, సంబంధిత వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈజిప్షియన్ జాతీయుడిని బహిష్కరించారు.
ఈజిప్షియన్ చట్టవిరుద్ధమైన కప్పిపుచ్చే కార్యకలాపాలను నిర్వహించడంలో సౌదీ పౌరుడి ప్రమేయం ఉందని కోర్టు తేల్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీటి ట్యాంకర్ల నుండి లాభాలలో 40 శాతం అందుకున్నాడని, తద్వారా ఈజిప్షియన్ విదేశీ పెట్టుబడి లైసెన్స్ పొందకుండానే వ్యాపారాన్ని చేశాడని తెలిపింది. యాంటీ-కవర్-అప్ చట్టం ప్రకారం..ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!